Header Banner

కాంగ్రెస్ నేత దారుణ హత్య.. వైఎస్ షర్మిల సంచలన వ్యాఖ్యలు!

  Sun Apr 27, 2025 21:39        Politics

కర్నూలు జిల్లా ఆలూరు నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జి చిప్పగిరి లక్ష్మీనారాయణ హత్యకు గురికావడం పట్ల ఏపీ కాంగ్రెస్ చీఫ్ షర్మిల తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఈ దారుణ ఘటనపై ఆమె తీవ్రంగా స్పందిస్తూ, రాష్ట్రంలో శాంతి భద్రతల పరిస్థితిపై తీవ్ర ఆందోళన వెలిబుచ్చారు. లక్ష్మీనారాయణను అత్యంత కిరాతకంగా లారీతో ఢీ కొట్టించి, ఆపై వేట కొడవళ్లతో నరికి చంపడం చూస్తుంటే రాష్ట్రంలో శాంతి భద్రతలు ఎంత దారుణంగా పడిపోయాయో అర్థమవుతోందని షర్మిల ఆవేదన వ్యక్తం చేశారు. ఇంతటి దారుణమైన రీతిలో ఒక రాజకీయ నాయకుడిని హత్య చేయడం సమాజాన్ని దిగ్భ్రాంతికి గురిచేసిందని ఆమె అన్నారు. ఈ హత్యోదంతంపై పోలీసు శాఖ తక్షణమే స్పందించి, అత్యున్నత స్థాయి విచారణ చేపట్టాలని షర్మిల డిమాండ్ చేశారు.

 

ఇది కూడా చదవండి: దివ్యాంగ బాలిక లావణ్య లక్ష్మికి ఫోన్ చేసి అభినందించిన బాలకృష్ణ! గర్వపడుతున్నాను చెల్లెమ్మా అంటూ..

 

ఈ ఘాతుకానికి పాల్పడిన అసలు నిందితులను త్వరితగతిన గుర్తించి, వారికి చట్టప్రకారం కఠిన శిక్షలు పడేలా చూడాలని ఆమె పోలీసు యంత్రాంగాన్ని కోరారు. ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా కఠిన చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందని ఆమె నొక్కి చెప్పారు. ఈ సందర్భంగా లక్ష్మీనారాయణ కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నట్లు షర్మిల పేర్కొన్నారు. కాంగ్రెస్ పార్టీ ఎల్లప్పుడూ లక్ష్మీనారాయణ కుటుంబానికి అండగా నిలుస్తుందని, వారికి అన్ని విధాలా సహాయ సహకారాలు అందిస్తుందని ఆమె భరోసా ఇచ్చారు. ఈ మేరకు షర్మిల సోషల్ మీడియాలో పోస్టు చేశారు. తన పోస్టుకు ఏపీ పోలీస్, చంద్రబాబు, పవన్ కల్యాణ్ లను ట్యాగ్ చేశారు.

 

ఇది కూడా చదవండి: మరో నామినేటెడ్ పోస్ట్ లిస్ట్ రెడీ! కూటమి ప్రభుత్వం కీలక నిర్ణయం.. ఎప్పుడంటే?

 

అన్ని రకాల వార్తల కోసం  ఇక్కడ క్లిక్ చేయండి

మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:

టీటీడీ కల్తీ నెయ్యి కేసులో కీలక పరిణామం.. మరో ఇద్దరిని అరెస్ట్ - త్వరలో ఛార్జిషీట్!

 

ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం.. ఆ ఫీజులు తగ్గింపు.. సెప్టెంబర్ నుంచి అమల్లోకి!

 

రేపే జిఎంసి ఎన్నిక! నేడు నామినేషన్ వేయనున్న కూటమి అభ్యర్థి!

 

రైతులకు తీపి కబురు! పీఎం - కిసాన్ 20వ విడత.. పూర్తి సమాచారం!

 

వైసీపీకి షాక్.. లిక్కర్ స్కామ్ కేసులో కీలక మలుపు.. సజ్జల శ్రీధర్ రెడ్డికి రిమాండ్!

 

వివేకా కేసులో బిగ్ ట్విస్ట్.. రంగన్న భార్యకు సిట్ నోటీసులు.. ఈ వరుస మరణాల వెనుక.!

 

మరో పదవిని కైవసం చేసుకున్న కూటమి ప్రభుత్వం! 74 మంది మద్దతుతో..

 

ఏపీలోని కూటమి ప్ర‌భుత్వానికి కేంద్ర గుడ్‌న్యూస్.. ఆ నిధుల‌ విడుద‌ల!

 

వైసీపీ నేతకు దిమ్మదిరిగే షాక్! అప్పుల భారం - ఆస్తులు వేలం!

 

ఢిల్లీలో జరిగిన గంటల చర్చలు.. కీలక నిర్ణయాలు ! వాటికి ఓకే చెప్పిన మోదీ!

 

దెబ్బకు ఠా దొంగల ముఠా! లిక్కర్ కేసులో మరో నిందితుడు అరెస్ట్!

 

టీటీడీ కీలక నిర్ణయం! ఇకనుండి భక్తులకు అవి ఉచితం! ప్రవాసాంధ్రులకు కూడా భాగస్వామ్యం!

ఆంధ్ర  ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:

Whatsapp group

Telegram group

Facebook group



   #AndhraPravasi #Hyderabad #RevaParty #Polices